ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ట్విట్టర్‌లో .. ఎన్టీఆర్ సవాల్‌ని స్వీకరిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తను నటించిన ఛాలెంజ్ సినిమాలోని ఇట్స్ మై ఛాలెంజ్ అనే క్లిప్‌ని జత చేస్తూ.. తారక్, నీ సవాలు స్వీకరించానని పేర్కొన్నారు. అలాగు మీ పార్ట్‌నర్ రామ్ చరణ్ వీడియో కోసం వెయిటింగ్ అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఇల్లాలికి తోడుగా సాయపడాలని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన బి ది రియల్ మెన్ ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సందీప్.. రాజమౌళికి ఛాలెంజ్ విసరగా, దానిని సంతోషంగా స్వీకరించారు. ఇక ఈయన నుండి ఎన్టీఆర్..ఇక్కడ నుండి చిరు వరకు వెళ్లింది. కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్ ఛాలెంజ్‌ని కొరటాల శివ స్వీకరిస్తున్నట్టు తన ట్వీట్ ద్వారా పేర్కొన్న విషయం విదితమే.