పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రం మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు 22 వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించడంతో, పరీక్షల తేదీలను మరోమారు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటించారు.
పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం