మతస్వేచ్ఛపై మోదీతో చర్చిస్తాం

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ‘భారత్‌లో మతస్వేచ్ఛ’ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ట్రంప్‌ పర్యటనకు కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఓ సంస్థ ‘అంతర్జాతీయంగా మతస్వేచ్ఛ’ అనే అంశంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తర్వాత భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గ డం ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేసిం ది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌కు చెందిన సీనియర్‌ అధికారి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ గురించి విలేకరులు ప్రస్తావించగా.. వాటిపై తాము కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ‘ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ప్రజాస్వామ్యం, మతస్వేచ్ఛపై అమెరికా విధానాలను వివరిస్తారు. ముఖ్యంగా మా ప్రభుత్వ ప్రాధాన్య అంశమైన మతస్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు’ అని పేర్కొన్నారు. 


భారత్‌లోని ప్రజాస్వామ్య విధానాలు, సంస్థలపై అమెరికాకు అమిత గౌరవం ఉన్నదని, వాటిని కొనసాగించాలని కోరుతామని చెప్పారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ చేసిన మొదటి ప్రసంగంలో భారత్‌లోని మైనార్టీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అదేసమయంలో భారత్‌ ప్రజాస్వామ్య విధానాలను, పరమత సహన సిద్ధాంతాన్ని కొనసాగించాలని, మైనార్టీలను గౌరవించాలని ప్రపంచం మొత్తం కోరుకుంటున్నది. ఈ విలువలు భారత రాజ్యాంగంలోనే స్పష్టం గా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. భారత్‌.. మతం, భాష, సంస్కృతి పరంగా భిన్నత్వాన్ని కలిగి ఉన్నదని, ప్రపంచంలోనే అతిపెద్ద నాలు గు మతాలకు భారత్‌ పుట్టినిల్లని చెప్పారు. మరోవైపు భారత్‌తో కుదుర్చుకోబోయే వాణి జ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధికారులు తెలిపారు. భారత ఉత్పత్తులకు జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ (జీఎస్పీ) కింద ప్రోత్సాహకాలు అందించడానికి తాము మొగ్గు చూపుతున్నామని, కానీ మోదీ ప్రభు త్వం మాత్రం భారత మార్కెట్‌లోకి అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడంపై సరిగా స్పం దించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. 


 


Popular posts